25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

పంటలు ఎండిన రైతాంగాన్ని ఆదుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

  • ఎండిపోయిన పంటలకు ఎకరాల రూ. 30వేల నష్ట పరిహారం ఇవ్వాలి
  • ఏఐయుకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్

 

భీమ్ గల్, బతుకమ్మ : భూగర్భ జలాలు ఉండి కరెంటు కోతలతో పంటలు ఎండిన రైతాంగాన్నీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోమవారం భీంగల్ మండలంలోని గంగారాయి, దేవక్కపేట్, రాంచందర్ పల్లె, తాళ్లపల్లి, దేవన్ పల్లి, రహత్ నగర్ తదితర గ్రామాల్లో కరెంట్ కోతలతో ఎండిపోయిన పంటలను  అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ తమ సంఘం ప్రతినిధులతో కలిసి ఎండిన పంటలను  పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తును అందిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటుందని ,ఆచరణలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చెప్పేదానికి చేసే దానికి చాలా తేడా ఉందన్నారు. వాస్తవంగా భూగర్భ జలాలు తగ్గిపోయి అనేక గ్రామాల్లో పంటలు ఎండిపోతున్న  భీమ్ గల్ మండలంలో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ‘దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించడు’ అన్నట్టుగా పరిస్థితి దాపురించిందన్నారు. భీమ్ గల్ మండలంలో ముఖ్యంగా గిరిజన గ్రామాల తో పాటు అనేక గ్రామాల్లో  వ్యవసాయ పంటలు భూగర్భ జలాలు ఉండి కరెంటు కోతల వల్ల  ఎండిపోయాయన్నారు. ముఖ్యంగా రాత్రిపూట వచ్చే కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.సుమారు  15వేల ఎకరాల్లో వరి పంట పొలాలు పొట్ట దశలో, కాయగాసే సమయంలో ఎండి పోవడంతో రైతులు లబో, దిభోమంటున్నరన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకొని, నష్టపరిహారం అందించాలన్నారు. ఎకరానికి రూ.30 వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రైతాంగం అంత పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటారని ఆయన హెచ్చరించారు.  కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) రాష్ట్ర కార్యదర్శి బి. దేవరాం, సీపీఐ(ఎం.ఎల్.) రాష్ట్ర నాయకులు పి. రామకృష్ణ , జిల్లా నాయకులు కే. రాజేశ్వర్, ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్,పీడీ ఎస్ యు జిల్లా అధ్యక్షులు ఎం. నరేందర్, మదన్ లాల్ తదితర రైతులు పాల్గొన్నారు.

More articles

Latest article