. . . కల్లాల్లోనే ఆరు వేల బస్తాల ధాన్యం
భిక్కనూర్, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కాచాపూర్ లో రైతులు రాస్తారోకో నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు చేసిన కల్లాల్లోనే 6 వేల బస్తాల ధాన్యం ఉన్న లోడింగ్ చేయకపోవడం పై నిరసన తెలియ చేశారు. భిక్కనూర్- దోమకొండ రహదారిపై బుధవారం బైటాయించారు. కోతలు జరిగిన రోజులు గడిచిన ధాన్యం కొనుగోలు చేయలేదు , ఇప్పుడు లారీ ల కొరత అని లోడింగ్ చేయడం లేదని వాపోయారు. లోడింగ్ చేయకపోవడం వలన కల్లాల వద్ద రాత్రనక పగలనక కాపు కాయాల్సి వస్తుందని వాపోయారు. అధికారులు లోడింగ్ పై హామీ ఇస్తే ఇక్కడ నుంచి కదిలేది లేదని రోడ్డుపై భీష్మించుకు కుర్చుండటంతో రెండు వైపుల వాహనాలు నిలిచిపోయాయి. సోసైటి నిర్వహకులు లోడింగ్ వరకు ధాన్యం మా బాధ్యత కాదని చేతులెత్తేశారు అని అవేదన వ్యక్తం చేశారు.
