27.3 C
Hyderabad

తప్పని ‘బండ’ బాదుడు-ముక్కుపిండి అదనపు వసూళ్లు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భారత్ గ్యాస్ నిర్వాహకుల నిలువు దోపిడీ

 

. . . వినియోగదారుల వద్ద నుంచి అధిక డబ్బులు వసూలు

 

రుద్రూర్, బతుకమ్మ :

 

భారత్ గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో సిబ్బంది నిర్ణీత ధర కంటే అదనంగా రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తున్నట్లు చాలా చోట్ల వినియోగదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో భారత్ గ్యాస్ డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగదారుల నుంచి ముక్కుపిండి అదనపు వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం లేదా ఆయిల్ కంపెనీలు నిర్దేశించిన అసలు ధరకే సిలిండర్ ఏజెన్సీలకు చేరుతుంది. అయితే, రవాణా, హమాలీ, మెట్లెక్కింపు లేదా నిర్వహణ ఖర్చుల పేరుతో డెలివరీ బాయ్స్ అదనపు ఛార్జీలు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు స్పందించి భారత్ గ్యాస్ నిర్వాహకుల పై, డెలివరీ బాయ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

More articles

Latest article