బాన్సువాడ , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో న్యాయవాదిపై జరిగిన దాడిని నిరసిస్తూ బుధవారం బాన్సువాడ న్యాయవాదులు విధులను బహిష్కరించారు. న్యాయవాదిపై జరిగిన దాడి హేయమైన చర్యగా ఖండించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి, రమాకాంత్, లక్ష్మారెడ్డి, అయ్యల ఆనంద్, మొగులయ్య, ఖలీల్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.
