28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు ఖజా మొయినుద్దీన్ డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ లో డిసెంబర్ 6న వరంగల్ పట్టణంలో జరిగే జనసభను విజయవంతం చేయాలని బుధవారం కరపత్రాలు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా నాయకులు ఖజా మొయినుద్దీన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  చిత్తశుద్ధితో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతరమవుతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాన్ని సన్నగిల్లుతున్నాయని అన్నారు. రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని,  గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి మూలంగా చిన్నా సన్నకారు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. కార్మికులు కనీసం వేతనాలు అందడం లేదని, మహిళలకు రక్షణ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. హత్యలు,అత్యాచారాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కుల దురంకార  హత్యలకు తెలంగాణ కేంద్ర గా మారిందని, పోడు భూముల సమస్య పరిష్కరించలేదని తెలిపారు. ఆదివాసి గిరిజన అభద్రత భావంతో బతుకుని వెళ్లదీస్తున్నారన్నారు. విద్యార్థులు రోడ్డుకు పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలకు వైద్యం అందిన ద్రాక్షలాగా మారిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఐఎస్ఏ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్, కార్మిక సంఘం నాయకులు ఇందూరు రాజయ్య , ఏఐఎస్ఎ జిల్లా  కార్యదర్శి జ్వాల , జిల్లా నాయకులు శేఖర్, అజయ్, నవీన్, మేఘన, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article