- అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్
రుద్రూర్, బతుకమ్మ : విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల, అంగన్వాడి కేంద్రాన్ని, కృషి విజ్ఞాన కేంద్రాన్ని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలో వంటగదిని, పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపల్ శ్యామల, తహసిల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు, ఎంఈఓ తదితరులు ఉన్నారు.

