- దరఖాస్తులకు ఆసక్తి చూపని వ్యాపారులు
- గడువు పొడిగించిన వచ్చినవి అత్తెసరు దరఖాస్తులు
- దరఖాస్తు ఫారాల ధరల పెంపే కారణం
- ముగిసిన ఏ4 మద్యం షాపుల లైసెన్స్ దరఖాస్తుల గడువు
- ఈ నెల 27న లక్కీ డ్రా ద్వార మద్యం దుకాణాల కేటాయింపు
నిజామాబాద్, బతుకమ్మ : మద్యం దుకాణాల లైసెన్స్ ల కేటాయింపును ఆదాయ వనరుగా మార్చాలనుకున్న ప్రభుత్వ ఆంచనాలు తప్పాయి. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత పాలసీలో పెట్టుబడికి 25 వంతుల రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈసారీ దరఖాస్తు ఫారాల ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం అబ్కారీ శాఖ ద్వారనే పొందాలనే ప్రభుత్వ ప్లాన్ అట్టర్ ప్లాపైంది. లక్కీ డ్రాల ద్వారనే మద్యం దుకాణాల కేటాయంపు జరుగుతుండటంతో గతంలో మాదిరిగానే ఏ4 మద్యం దుకాణాలను దక్కించుకోవాలనుకునే ఔత్సాహికులకు దరఖాస్తు ఫారం ధరను రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. తిరిగి చెల్లించక్కర్లేని నగదు (నాన్ రిఫండబుల్) ద్వారనే కోట్ల రూపాయాల ఆదాయం కోసం 2025-27 నూతన మద్యం పాలసీని వినియోగించుకోవాలనుకున్న ఆలోచన చేసిన ఎక్సైజ్ శాఖకు షాకిచ్చారు వ్యాపారులు. మద్యం దుకాణాలకు దరఖాస్తులు తక్కువగా వచ్చాయని గడువు పొడిగించిన అత్తెసరు దరఖాస్తులు వచ్చాయి. ఈ సారీ దరఖాస్తులకు తెలంగాణలో ఆంధ్రతో పాటు మహారాష్ట్ర, కర్నాటక వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్న ఆదాయం మాత్రం మూరెడు కూడా పెరుగలేదు.
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 151 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో ఒక్క నిజామాబాద్ జిల్లాలో 102 మద్యం దుకాణాలు ఉన్నాయి. 2023-25 లిక్కర్ పాలసీ ప్రకారం మద్యం షాపులను దక్కించుకునేందుకు వ్యాపారులు లక్కీ డ్రా లో పాల్గొనేందుకు ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున దరాఖాస్తులకు వసూలు చేశారు. ఆనాడు కేవలం దరఖాస్తుల ద్వారనే రూ.75 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి ఖచ్చితంగా రూ.150 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కాని మద్యం వ్యాపారులు షాకిచ్చారు. జిల్లాలో ఈ నెల 18 వరకు 2633 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 21 నుంచి 23 వరకు దరఖాస్తు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ నెల 21, 22 తెదీలలో 25 దరఖాస్తులు పెరిగాయి. చివరి రోజైన గురువారం 90 వరకు దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గత మద్యం పాలసీలో రూ.75 కోట్ల ఆదాయం వస్తే, నయా పాలసీలో కేవలం రూ.82 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టయింది. కమిషనర్ కార్యలయం ద్వార, నిజామాబాద్ జిల్లాలోని అన్ని దరఖాస్తులను పరిశీలించిన అది రూ.90 కోట్లు చేరకపోవడం అధికారులలో నిరాశను నింపింది. గడువు పెంచిన మూడు రోజులుగా వచ్చిన కలిపిన 2750 కి అటు ఇటుగా వచ్చాయని అధికారులు చెప్పారు. కేవలం రూ.82 కోట్ల ఆదాయం అంటే గత పాలసీ కన్న ఆదాయం రూ.7 కోట్లు అని చెప్పాలి.
కామారెడ్డి జల్లాలో 49 మద్యం షాపులకు 1449 దరాఖాస్తులు వచ్చాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. 2023-25 మద్యం పాలసీ సమయంలో రూ.2044 దరఖాస్తులు వచ్చాయి. ఆనాడు ఆదాయం రూ.44.88 కోట్లు. ప్రస్తుతం 2025-27 మద్యం పాలసీకి రూ.3 లక్షలుగా దరఖాస్తు ఫారం ధర నిర్ణయించడంతో దరఖాస్తులు తగ్గాయని చెప్పాలి. నిజామాబాద్ జిల్లాతో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో ధరఖాస్తులు దండిగానే వచ్చాయి. 49 షాపులకు 1449 దరఖాస్తుల ద్వార రూ.43.47 కోట్ల ఆదాయం వచ్చిందని మరికొన్ని దరఖాస్తులతో గత ఆదాయంను చేరుతామని అధికారులు ఆశతో ఉన్నారు. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లాలో అప్లికేషన్ లు తగ్గిన ధర పెంపు కారణంగా గత సీజన్ స్థాయి ఆదాయం రావడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాతో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల ధరఖాస్తుల ద్వార ఆదాయం పెరిగిందని అధికారులు ఖుషీగా ఉన్నారు. ఈ నెల 27న లక్కి డ్రాల ద్వార ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.