నవీపేట్,బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. నవీపేట్ మండలం నాగేపూర్ రోడ్డులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించారు. మహిళను హత్య చేసి దహనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై అఘాయిత్యం చేశారా మరి ఏం జరిగి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. రోడ్డు పక్కన నిర్మానుష్య స్థలంలో మహిళపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. గడిచిన కొన్ని రోజుల క్రితం నాగపూర్ గుట్టల్లో గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని గోనెసంచిలో గుర్తించారు. సంబంధిత వ్యక్తి ఆనవాలు ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఈ కేసు కొలిక్కి రాకముందే మరో మహిళ హత్య, దహనం పలు అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, నవీపేట్ ఎస్సై ల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.