27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉపాధి కూలీలను పెంచాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఎంపీడీవో శ్రీనివాస్

 

జుక్కల్, బతుకమ్మ :

 

జుక్కల్ మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ గంగారాంకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు నిర్వహించాలని సూచించారు. కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్రామంలోని చెరువులోని మట్టిని రైతుల వ్యవసాయ భూముల్లో వేయిస్తున్న పనులను పరిశీలించిన ఎంపీడీవో, చెరువు మట్టిని భూముల్లో వేయడం వల్ల పంట దిగుబడి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రైతులు కూడా చెరువు మట్టితో భూముల సారవంతత పెరిగి పంట దిగుబడి అధికంగా వస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలోని నర్సరీ మొక్కలను ఎంపీడీవో శ్రీనివాస్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిరోజూ మొక్కలకు నీరు అందించాలని ఫీల్డ్ అసిస్టెంట్‌కు సూచించారు. సరైన నీటి సరఫరా లేకపోతే మొక్కలు ఎండిపోతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాము, ఏపీవో తులసిరామ్, టీఏ స్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ గంగారాం, ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

 

Employment should be increased.

More articles

Latest article