ఉపాధి కూలీలను పెంచాలి
. . . ఎంపీడీవో శ్రీనివాస్ జుక్కల్, బతుకమ్మ : జుక్కల్ మండలంలోని మహ్మదాబాద్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను శుక్రవారం ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. గ్రామంలో ఉపాధి కూలీల సంఖ్యను పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్ గంగారాంకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పనులు నిర్వహించాలని సూచించారు. కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం...