జుక్కల్, బతుకమ్మ :
పేద మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ పథకాల చెక్కులను నిజాంసాగర్‌లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అధ్యక్షతన స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థికంగా అండగా నిలవడమే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి, మండలంలోని సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, యువజన కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం… అర్హుల ముఖాల్లో ఆనందమే మా విజయానికి నిదర్శనం అని నాయకులు పేర్కొన్నారు.