27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఏసీబీ వలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగులు

Must read

📰 Generate e-Paper Clip

 వెబ్ డెస్క్, బతుకమ్మ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ, ల్యాండ్ సర్వే శాఖ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. మంగళవారం వేర్వేరు సమయంలో రెండు ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగులను అవినీతి నిరోధక శాఖాధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

పెద్దపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని సర్వే చేసిన భూమి తాలూకు నకల్లు ఇవ్వడానికి సర్వేయర్ సునీల్ బాధితుడి నుంచి రూ.20 వేలు డిమాండ్ చేశారు. భాధితుడు బతిమాలడంతో రూ.10 వేలు ఇస్తేనే జిరాక్స్ పేపర్స్ ఇస్తానని ఒప్పుకున్నాడు. బాధిత వ్యక్తి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సర్వేయర్ సునీల్ తన ప్రైవేట్ అసిస్టెంట్ రాజేంధర్ రెడ్డికి ఫోన్ పే చేయించుకున్నాడు. వాటిని తన ఖాతాలోకి మళ్లించుకోవడంతో వాటిని ఆడియో రికార్డు చేసిన ఏసీబీ అధికారులు మంగళవారం సర్వేయర్ సునీల్ అతని ప్రైవేట్ అసిస్టెంట్ రాజేంధర్ లను అదుపులోకి తీసుకున్నట్టు కరీంనగర్ రేంజ్ ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టుకుని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇంచార్జీ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు  రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.6 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. వైద్య ఆరోగ్యశాఖలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా పనిచేసిన అధికారికి పదవి విరమణ తరువాత రావాల్సిన ప్రయోజనాల ఫైల్స్ ను తయారు చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. మంచిర్యాల పట్టణంలోని ఓ హోటల్ లో రిటైర్డ్ అధికారి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

More articles

Latest article