26.2 C
Hyderabad
Monday, August 3, 2026

దేశం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్

Must read

📰 Generate e-Paper Clip

  • ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశం కోసం పోరాటం చేసిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భవ దినోత్సవం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం ఏఐఎస్ఎఫ్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం 1936 ఆగస్టు 12 నాడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో లక్నో జిల్లా బెనారస్ యూనివర్సిటీలో ఏర్పడి శాంతి, అభ్యుదయం ,సోషలిజం అనే నినాదంతో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అని అన్నారు. 90 సంవత్సరాల పాటు విద్య రంగ సమస్యల పైన నిరంతరం అధ్యయనం చేస్తూ విద్యార్థుల సమస్యలపై పోరాడుతూనే ప్రభుత్వ పాలకులకు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ విద్యార్థుల సమస్యలు పరిష్కారమే మార్గంగా పనిచేస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత విద్యా కాషాయకరణ చేయాలని ఆలోచన తోటి మతోన్మాద శక్తులను ప్రేమిస్తూ విద్యార్థులకు మతాలుగా విడదీసి ఆలోచనలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యావత్ దేశవ్యాప్తంగా విద్యార్థులు అందరూ కూడా పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా పిలుపునిస్తున్నాం అన్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక అనేక మంది విద్యార్థులు పై చదువులకు వెళ్లాలంటే విద్యార్థులకు సర్టిఫికెట్లు అవసరం ఉన్నప్పటికీ రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉందని అన్నారు. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్, జిల్లా నాయకుడు సుభొద్, నాయకులు సంతోష్, కరణ్, కాళీ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article