27.5 C
Hyderabad
Friday, July 31, 2026

డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . పీఆర్ టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పీఆర్‌టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు పదార్థాలు వ్యక్తులను వ్యసనానికి బానిసలుగా మార్చడమే కాకుండా వారి కుటుంబాలను, జీవితాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఆలోచనా శక్తి, విచక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత తమ భవిష్యత్తును, ఉన్నత లక్ష్యాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువతలో డ్రగ్స్ దుష్పరిణామాలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా మాదకద్రవ్యాల వ్యసనానికి గురైతే వారిని పునరావాస కేంద్రాలకు చేర్పించడం ద్వారా సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చని తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలు, రవాణా లేదా సరఫరాకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు పోలీసుల 1090 హెల్ప్‌ లైన్‌కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు.

More articles

Latest article