రూ.110 కోట్లు ఫ్రీజ్ చేసిన అధికారులు
హైదరాబాద్, బతుకమ్మ : ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ పరి మ్యాచ్ కేసులో హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా ఈడీ 17 చోట్ల సోదాలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు బ్యాంక్ ఖాతాల్లోని రూ.110 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు ఈడీ అధికారులు తెలియజేశారు. డిజిటల్ డాక్యుమెంట్లు, మ్యూల్ ఖాతాల డెబిట్, క్రెడిట్ కార్డులు, డిజిటల్ పరికరాలను సైతం స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ముంబాయి సైబ్ ర్ క్రైం పోలీస్ స్టేషన్లో పరిమ్యాచ్ డాట్ కాంపై నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహకులు పెట్టుబడి పెట్టిన వారి నుంచి ఏడాదిలో రూ. 3 వేల కోట్లు కాజేసినట్లు ఈడీ పేర్కొంది.హవాలా రూపంలో డబ్బును యూకేకి పంపి అక్కడ క్రిప్టో కరెన్సీగా మార్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
