స్వాతంత్య్ర దినోత్సవం వేళ చొరబాట్లను నివారించేందుకు..
వెబ్ న్యూస్,బతుకమ్మ : స్వాతంత్య్ర దినోత్సవం వేళ చొరబాట్లను నివారించేందుకు సైన్యం సరిహద్దుల్లో అత్యాధునిక భద్రతా వ్యవస్థను మెహరించింది. మూడు అంచెల్లో పనిచేసే రోబోటిక్ గ్రిడ్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. కుప్వారా జిల్లాలోని తాంగ్ దర్ గ్రామం వద్ద ఈవ్యవస్థ ను ఏర్పాటు చేశారు. పాకిస్థాన్ వైపు నుంచి ఒక్కరూ కూడా సరిహద్దు దాటకుండా చూడాలని దళాలను ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ గ్రేడ్ తొలి అంచెలో ప్రత్యేకమైన రాడార్లు, థర్మల్ ఇమేజింగ్ వ్యవస్థలు, మానవ రహిత విమానాలు ఉంటాయి. ఈ భూమిపై కదలికను గుర్తించేందుకు నిరంతరం పనిచేస్తాయి. రెండో అంచెలో ప్రత్యేకమైన మందుపాతరలతో కూడిన బ్యారియర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకమైన ఆప్టికల్ వ్యవస్థ మొహరించారు. ఇక చివరి దశలో బలగాల గస్తీ ఉంటుంది.
