- కరెంటు లేకపోవడంతో గ్రామస్తుల ఆగ్రహం
- బలగంను చూసి పరార్
- ఆలస్యంగా వెలుగులోకి
వేల్పూర్ బతుకమ్మ
కరెంటు పోయి అరగంట కావస్తున్నా రావడం లేదని ఫ్యూస్ అఫ్ కాల్ కు ఫోన్ చేసారు. సబ్ స్టేషన్ లో తాగి విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్ పై గ్రామస్థులు కోపోద్రిక్తులయ్యారు. ఆర్మూర్ డివిజన్ వేల్పూర్ సెక్షన్ లోని కుకునూర్ గ్రామంలో గల సబ్ స్టేషన్ లో సోమవారం రాత్రి జరిగిన పరిస్థితి ఇది.
తాగి విధులు
కరెంటు సబ్ స్టేషన్ నుంచే సరఫరా అవుతున్నందున అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో అతిగా మద్యం సేవించి విధులు నిర్వహిస్తే ప్రాణాపాయ పరిస్థితులు నెలకొంటాయి. ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తుల కోసం ఎల్ సి తీసుకుంటారు. తాగినవారు ఆపరేటింగ్ చేసే సమయంలో మద్యం మత్తులో చూసుకోలేక లైన్ వేస్తే జరగరానిది క్షణాల్లో జరిగిపోతుంది. ఈ మద్యే బదిలీపై వేల్పూర్ సెక్షన్ లోని సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా చేరాడు. స్థానిక అధికారుల సూచన మేరకు ఇక్కడ వద్దని కుకునూర్ కు పంపించారు. గతంలో పని చేసిన సబ్ స్టేషన్ లోను ఇదే వ్యవహారం కొనసాగింది.
అన్నీ తెలిసే పోస్టింగ్
లైన్ మెన్ మద్యానికి బానిసయ్యాడని డివిజన్ అంతా తెలుసు. అయినా మళ్ళీ సబ్ స్టేషన్ కు బదిలీ చేయడం వెనుక నాయకుల ప్రోద్భలం ఉందని సిబ్బంది కోడై కూస్తోంది. మద్యం సేవించి విధులు నిర్వహిస్తే జరగరాని ప్రాణ నష్టం జరిగితే దీనికి భాద్యులు ఎవరనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెలుగుతోంది. లోపాయికారి ఒప్పందం ఏం జరిగిందో తెలియదు గాని సబ్ స్టేషన్ కు మాత్రం పోస్టింగ్ ఇప్పించారనే ప్రచారం డివిజన్ లో జరుగుతోంది.
గ్రామస్తుల ఆగ్రహం
కొద్ది సేపు కరెంటు పోవడంతో తొందర్లోనే వస్తుందని చూసిన గ్రామస్థులకు అరగంటైనా జాడ లేకపోవడంతో సబ్ స్టేషన్ కు ఫోన్ చేయడం మొదలెట్టారు. గాబర పడ్డ కొందరు యువకులు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. గాఢ నిద్రలో ఉన్న ఆపరేటర్ ను లేపిన గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
అక్కడి నుంచి పరార్
తాను నిద్రావస్థ నుంచి మేల్కొనగానే తప్పు జరిగినట్లు ఆపరేటర్ గ్రహించాడు. పోయిన కరెంటు వచ్చేలా చేసి, తన ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. వెళ్తూ, వెళ్తూ సబ్ స్టేషన్ ఫోన్ అక్కడే వదిలేసాడు.
కుకునూర్ గ్రామంలో సోమవారం రాత్రి సంఘటన జరిగితే ఇప్పటివరకు ఆపరేటర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై భిన్న స్వరాలు వినబడుతున్నాయి.
సస్పెండ్ చేయలేదు: ఏడిఈ భీంగల్
సబ్ స్టేషన్లో జరిగిన ఉదంతంపై స్థానిక ఏఈ,భీంగల్ ఏడిఈ కుకునూర్ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టినట్లు తెలిసింది. దీనిపై వివరణ కోరగా ఆపరేటర్ (లైన్ మెన్) ను సస్పెండ్ చేయలేదు అని చెప్పడం కొసమెరుపు.
