. . . కోలాహంగా శోభయాత్ర
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నగరంలోని గాజుల్‌పేట్‌లో గల గురుద్వారాలో గురునానక్ జయంతి వేడుకలను శుక్రవారం ఉదయం నుంచి ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి సంకీర్తన,గురు గ్రంథ పఠనం కొనసాగింది. అదేవిధంగా సిక్కులు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఉత్సవాలను సాయంత్రం గురుద్వారా నుంచి పెద్ద బజార్, నెహ్రూ పార్క్, అహ్మదీబజార్ మీదుగా శోభాయాత్ర భక్తిశ్రద్ధల నడుమ కొనసాగింది. శోభయాత్ర పూర్తయ్యే వరకు భక్తులు కోలాటాల నడుమ సంతోషంగా శోభయాత్రను కొనసాగించారు. శోభయాత్రలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త, నూడా చైర్మన్ కేశ వేణులు పాల్గొన్నారు. సిక్కు సోదరులు కత్తి విన్యాసంతో అలరించారు. గురుద్వార్ కమిటీ ప్రెసిడెంట్ రాజేందర్ సింగ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. శోభయాత్ర పూర్తి అయ్యేవరకు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. ట్రాఫిక్ సిఐ వీరయ్య, ఎస్సై సంజీవ్, టూ టౌన్ ఎస్ఐ యాసర్ అరాఫత్ బందోబస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సిక్కు బంధువులకు పూజారి సర్దార్ సోహన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

