బతుకమ్మ,మోర్తాడ్: మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన గోడ పత్రికలను మోర్తడ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టి. పెద్దన్న శనివారం ఆవిష్కరించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ కోఆర్డినేటర్ రాజయ్య మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహనలో భాగంగా ఎం సి హెచ్ ఆర్ డి హైదరాబాద్ లో డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ యాంటీ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య చేతిలో మీదుగా శిక్షణ ధృవకరణ పత్ర అందుకున్నారు. మా కళాశాలలో మారక ద్రవ్యాల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి కోఆర్డినేటర్ గా ఏన్. రాజయ్య సభ్యులుగా డాక్టర్. పి. బ్యూలా, అర్చన నియమించడం జరిగిందని విద్యార్థుల చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్యా జ్ఞానం నైపుణ్యాల వైపు దృష్టి కేంద్రీకించాలని పెద్దన్న తెలియజేశారు. అనంతరం విద్యార్థులు మాదగాద్రవ్యాల వ్యతిరేక ఉద్యమంలో ఎన్రోల్ మెంట్ చేసుకోవడం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, బోధన, బోధ నేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
