29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డా.పడకంటి రాము 21 వ ఎన్నికల సర్వే ఘన విజయం

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

15 సంవత్సరాలుగా తిరుగులేని విజయాలతో యువ వ్యాపారవేత్తగా గుర్తింపు పొంది తన స్వంత డబ్బులతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభాగ్యులకు ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలతో సహాయపడుతూ 2018 పార్లమెంట్ ఎన్నికల నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ ఎన్నికల సర్వేలు స్వచ్చందంగా నిర్వహిస్తూన్నారు. ఈ సర్వే లో 85% నుంచి 99% వరకు ఎన్నికల ఫలితాలతో పోలే ఎన్నికల సర్వే రిపోర్టులు ఎన్నికలకంటే ముందుగానే అందిస్తూ ఓటరు నాడిని గుర్తించడంలో ప్రావీణ్యుడైన డా. పడకంటి రాము 2026 తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల కోసం ధర్మపురి, భీంగల్, ఖానాపూర్, ఆర్మూర్, నిర్మల్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, మెట్ పల్లి, కామారెడ్డి, నిజామాబాద్ లాంటి 11 మున్సిపాలిటీల కు సంబంధించి సర్వేను అందించారు. ఈ  ఎన్నికల సర్వే నివేదిక వచ్చిన ఫలితాలతో మొత్తంగా చూస్తే 95% ఖచ్చితమైన విజయం సాధించి మరో సారి ప్రజలనాడి సమాజానికి తెలపటంలో ఘన విజయం సాధించటంతో విశ్వకర్మ జిల్లా సంఘం అధ్యక్షుడు శ్రీనివాస చారి, బీసీ నేతలు, వివిధ పార్టీలకు సంబంధించిన ప్రముఖ నాయకులు, సమాజ సేవకులు, ప్రజలు ఈ సందర్భంగా డా. పడకంటి రామును అభినందిస్తూ సన్మానించారు.

 

Dr. Padakanti Ramu's 21st election survey a resounding success
Dr. Padakanti Ramu’s 21st election survey a resounding success

More articles

Latest article