నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జాతీయ వైద్యుల దినోత్సవం (డాక్టర్స్ డే) సందర్భంగా నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. రాములు, ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కలిసి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్‌పర్సన్ డా. కవితా రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఆరోగ్య రంగంలో ఆమె అందిస్తున్న సేవలు, ప్రజారోగ్యాభివృద్ధికి చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ సన్మానం అందజేశారు. ఈ సందర్భంగా డా. కవితా రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ గౌరవం అందించిన సూపరింటెండెంట్ డా. రాములు, వైద్యులు, ఆస్పత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వైద్య వృత్తి అత్యంత గొప్పదని, ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తున్న ప్రతి వైద్యుడు సమాజానికి ఆదర్శమని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అంకితభావంతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పరస్పరం డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ వైద్య సేవలను మరింత మెరుగుపర్చేందుకు కృషి చేయాలని సంకల్పించారు.
