డిచ్‌పల్లి, బతుకమ్మ :
తెలంగాణ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు, మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన డా. పాత నాగరాజును యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి నియామక ఉత్తర్వులను అందజేశారు. డా. పాత నాగరాజు విశ్వవిద్యాలయంలో వివిధ కీలక పరిపాలనా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవం కలిగిన విద్యావేత్త. గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షులుగా, ప్రిన్సిపల్‌గా, ప్లేస్‌మెంట్స్ అండ్ ట్రైనింగ్ సెల్ డైరెక్టర్‌గా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా సుదీర్ఘకాలం సేవలందించారు. ఆయనకు ఉన్న పరిపాలనా అనుభవం, విద్యా రంగంలో చేసిన సేవలను గుర్తించి యూజీసీ అఫైర్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా నియామకమైన డా. పాత నాగరాజుకు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
