నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిసెంబర్ 5 నుండి 7వ తేదీ వరకు జిల్లాస్థాయి ఇన్స్పైర్, సైన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి.అశోక్ తెలిపారు. పాఠశాల విద్యాశాఖ నిజామాబాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ఆదేశానుసారం జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 సంయుక్తంగా నగరంలోని ఎస్ ఎఫ్ ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజాంబాద్ జిల్లాకు 2023 24 కు సంబంధించి 126 ఇన్స్పైర్ అవార్డులు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీ వారు విద్యార్థులకు అందజేశారని తెలిపారు. వారి అకౌంట్లో పదివేల రూపాయలు గత మార్చి నెలలోనే జమయ్యాయని అన్నారు. సంబంధిత గైడ్ టీచర్లు తమ విద్యార్థి చేత ప్రదర్శనను ను తయారుచేసి వాటిని జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించునట్లు ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ వహించాలని తెలిపారు. అయితే ప్రతి ప్రదర్శన గతంలో ఇచ్చిన టైటిల్ ఆధారంగా తయారు చేయాలని తెలిపారు. ఈ ప్రదర్శనలో మొత్తం 126 ప్రదర్శనలు సంబంధిత విద్యార్థులు గైడ్ టీచర్లు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా జిల్లాస్థాయి, రాష్ట్రీయ బాలు వైజ్ఞానిక ప్రదర్శన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఏకకాలంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సంబంధిత ఉపఅంశాలను ఇదివరకే అందరికీ కమ్యూనికేట్ చేయడం జరిగిందని తెలిపారు. రెండు ప్రదర్శనల కోసం కూడా గూగుల్ ఫామ్ అన్నది ముందే కమ్యూనికేట్ చేయడం జరిగిందని అన్నారు. ఈనెల 30లోగా బాల వైజ్ఞానిక ప్రదర్శన గూగుల్ ఫామ్ నింపాలని తెలిపారు. డిసెంబర్ 5వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు గైడ్ టీచర్ తమ విద్యార్థితో పాటు రిజిస్ట్రేషన్ ఫామ్, ప్రదర్శన తీసుకొని వచ్చి వారికి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆరవ తేదీ ఉదయం 9:00 గంటల నుండి ప్రదర్శన పోటీలను న్యాయ నిర్ణేతలు సందర్శించి ఉత్తమమైన ప్రదర్శనలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారని తెలిపారు.
