27.5 C
Hyderabad
Friday, July 31, 2026

కరుణా ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తులు పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: సమాజంలో కరుణ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమని డిఆర్ డీ ఏ సీ సీల జిల్లా కార్యదర్శి తడకల శ్రీనివాస్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో కరుణ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. భారత్ సేవా పురస్కార్ అవార్డు గ్రహీత, కరుణా ట్రస్ట్ చైర్మన్ తుమ్మల మహేష్ కుమార్ కుమారుడు అభ్యుదయ్ పుట్టినరోజు సందర్భంగా క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మణ్, కిరణ్ కుమార్, ట్రస్ట్ కోశాధికారి మౌనమి, వివో వనిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article