25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాల చుట్టూ, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మెండోరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్వాతి వినూత్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెండోరా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో ఆరోగ్య శిబిరం నిర్వహించి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పరిసరాల పరిశుభ్రంగా ఉంటే దోమలు ఎక్కువగా సంచరిస్తాయని దోమల వల్ల వచ్చే రోగాల వలన కలిగే అనర్థాల గురించి విద్యార్థులకు వివరించారు.  కార్యక్రమంలో ఆయుష్ వైద్యురాలు అరుణ, మండల విద్యాధికారి శ్రీనివాస్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Everyone should practice hygiene

More articles

Latest article