పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

0 14,612
  • ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వినర్ బాలకృష్ణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్న మెస్ బకాయిలు, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వినర్ బాలకృష్ణ డిమాండ్ చేశారు. నగరంలో శనివారం ఏబీవీపీ ఇందూరు జిల్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వినర్ బాలకృష్ణ మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ. 8300 కోట్ల  స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని అన్నారు. ముఖ్యంగా చదువుకొనే  పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన డిగ్రీ, పీజీ విద్యార్థులు, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేకపోవడం బాధాకరం అని తెలిపారు. పేరుకేమో ప్రభుత్వ కళాశాల కానీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ బకాయిలు రాక వాళ్ల చేతుల్లో నుండి డబ్బులు వసూలు చేస్తున్న పరిస్థితి నెలకొందని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ బిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని అన్నారు. రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుమారుగా 5 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడం తో  విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోందని అన్నారు. స్కాలర్షిప్ అందని కారణంగా విద్యార్థులు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, మెమోలు తీసుకోలేక, వారి పై చదువులకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని అన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థుల వద్ద కొన్ని కార్పొరేట్ కళాశాలలు అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పరిస్థితిని అరికట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే  పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను, మెస్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కంటేశ్వర జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, మహేష్, ప్రణీత్, సిద్దు, ప్రేమ్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.