. . . కమిషనర్ కు ఫిర్యాదుతో కలెక్టర్ ఆగ్రహం
. . . ఎఇఓల నిరసనలతో డిప్యూటేషన్ రద్ధు
. . . వ్యవసాయ శాఖలో వివాదం సద్దుమనిగినట్టేనా
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ వ్యవసాయ విభాగంలొ అ ఒక్కడి వల్ల చుట్టు ముట్టిన వివాధాల నేపథ్యంలో ఆ శాఖ పరువు రోడ్డున పడినట్లయింది. కామారెడ్డి జిల్లానుంచి నిజామాబాద్ జిల్లాకు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఆఫిసర్ గా పదోన్నతిపై రావడంతో బోదన్ లోని ఎడిఏ కార్యాలయంలో అతనికి పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఎఇఓగా చేసిన అనుభవం ధ్రుష్ట్య ఎదైనా మండలానికి ఎఓగా తీసుకోవాలని అతను అభ్యర్థించటంతోనే కోటగిరి ఎంఏఓగా డిప్యూటేషన్ ఇచ్చారు. అక్కడ అతని పనితీరు వల్ల విసిగిపోయిన రైతులు ఈ విషయంను అప్పటి సభాపతి పోచారంకు పిర్యాదు చేశారు. ఆ ఎవో స్వయానా బంధువు అని తెలిసినప్పటికి తన నియోజకవర్గంలో ఉండకూడదని పోచారం అధికారులను అదేశించారు. దీంతో నిజామాబాద్ డిఎఓ రెంజల్ కు డిప్యూటేషన్ లో ఎఓగా నియమించారు.
ఎఇఓలతో వివాదం…
అది నుంచి మండల పరిధిలో తన మార్క్ ను కనిపించుకొవాలనే ఉద్ధేశంతో పలు రకాలుగా వివాధాస్పధమైన నిర్ణయాలు ఎఇఓలపై రుద్ధుతున్నారు. గ్రామస్థాయిలో శాఖ పరంగా వీరి పనితీరు భారంగా మారినప్పటికి ఎఓ అదేశాలను పాటిస్తు విధులను నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ రూపోందించిన యాప్ ను డౌన్ లోడ్ చేసుకోని అందులో ఉన్న వివరాలను పొందుపరచాలని మండల పరిధిలోని ఎఇఓ లపై ఓత్తిడి చేయనారంబించారు.
నిరసనలకు బీజం..
రాష్ర్ట్లంలో వ్యవసాయదారుల పంటలను, భూముల హద్ధులను, సర్వే నంబర్ లను రాష్ర్ట వ్యవసాయ శాఖ రూపొందించిన డిజీటల్ క్రాఫ్ సర్వే యాప్ లో నిక్షిప్తం చేయాలని అదేశాలు తరుచుగా జారీ చేస్తొంది. పంటల వివరాల వరకు తాము చెయగలుగుతాము కాని సర్వే నంబర్ హద్ధుల గురించి తమతో కాదని రాష్ర్ట వ్యాప్తంగా ఉన్నఎఇఓలు తెల్చి చెబుతున్నారు. గ్రామస్థాయిలో వీరు కాకుండా కార్యాలయలలో కుర్చుని చేసేవారు ఉండకపోవడంతో పై స్థాయి నుంచి ఈ విషయంలో కిమ్మనలేకపోతున్నారు. ఇలాంటి వివాధస్పధంగా ఉన్న సమస్యను రెంజల్ మండల ఎఓ తెరమీదికి తీసుకురావాలని చేసిన కుఠిల ప్రయత్నమే నిజామాబాద్ జిల్లాలో ఎఇఓల నిరసనలకు బీజం పడింది.
ఫిర్యాదుల పరంపర…..
అది నుంచి వివాధస్పధుడిగా పెరున్న రెంజల్ మండల ఎఓ తీరువల్ల పిర్యాధుల పరంఫర మొదలైంది. ఇది చిలికి చీలికి గాలి వానాల మారి తన సీటు యదాస్థానానికి వెల్లేలా చేసింది. వ్యవసాయ కమీషనర్ అదేశాల అమలు చేయడంలో ఎఇఓలు విఫలం అవుతున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతు రాసీన లేఖ వాట్సప్ గ్రూప్ లో పోస్టు చేయడంతో వివాదానికి కారణం మొదలైంది. ఎప్పటినుంచో కాచుకుని కుర్చున్న బోదన్ ఎరువుల అమ్మకం వ్యాపారులు ఎఓ, ఎఇఓల మద్యల జరుగుతున్న వివాధం అనుకులంగా మలుచుకోని ఎఓపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. అదే సమయంలో ఎఓ నిర్ణయాలను వ్యతిరేకిస్తు ఎఇఓలు డిఎఓ చాంబర్ ఎదుట నిరసనలు చేశారు. సంబందిత పోటోను ఎఇఓలకు సంబందించిన వాట్సప్ గ్రూప్ లో జిల్లా అధ్యక్షుడు పోస్టు చేయడంతో అతనిపై పరువు నష్టం కోరుతు పోలిస్ లను ఆశ్రయిస్తానని తిరిగి పోస్ట్ చేయడంతో దినిపై జిల్లా కలెక్టర్ సిరియస్ గా తీసుకున్నారు. జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించిన డిఎఓ వాజీద్ హుస్సేన్ లిఖీత పూర్వకంగా కలెక్టర్ ధ్రుష్టికి తీసుకువెల్లారు. ఫలితంగా ఎంఏఓ పోస్ట్ కాస్తా, యదాలాపంగా (సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ఆఫిసర్) గా మారిపోయింది. రెంజల్ ఎంఏఓగా ఎడపల్లి మండల వ్యవసాయ అధికారికి ఇంచార్జీ భాధ్యతలు అప్పగించారు.
మున్నాళ్ల ముచ్చటగా రెంజల్ ఏఓ పోస్టు
