. . . రూ 4 లక్షల ఎల్ ఓ సి అందజేత
రుద్రూర్, బతుకమ్మ :
అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదరాలికి బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కుర్లేం గంగమణి గత కొద్దికాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుంది. ఆ కుటుంబం నిరుపేదది కావడంతో స్థానిక నాయకులు మాజీ విండో చైర్మన్ పత్తి రాముకి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుపగా, వెంటనే స్పందించిన పత్తి రాము ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి నిరుపేద కుటుంబానికి భరోసా ఉండాలన్న మానవత దృక్పథంతో గుండె శాస్త్ర చికిత్స కోసం 4 లక్షల రూపాయల ఎల్ ఓ సి ని నిరుపేద కుటుంబానికి అందించారు. గుండె శాస్త్ర చికిత్స కోసం ఎల్ ఓ సి నిరుపేద కుటుంబానికి అందించామని స్థానిక నాయకులు పత్తి రాము తెలిపారు. నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి పత్తి రాముతో పాటు కుర్లెం గంగమణి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
