27.5 C
Hyderabad
Friday, July 31, 2026

అర్వింద్ ధర్మపురి కార్పస్ ఫండ్ ద్వారా బూత్ స్థాయి కార్యకర్తలకు 13.65 లక్షల చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

. . . కార్యకర్తలకు అన్నివేళలా అండగా ఉంటా

.. ఎంపి అర్వింద్ ధర్మపురి

 నిజామాబాద్ , బతుకమ్మ:

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు  అన్నివేళలా అండగా ఉంటానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి అన్నారు. బుధవారం నిజామాబాద్ లోని ఆయన కార్యాలయంలో అర్వింద్ ధర్మపురి  బూత్ స్థాయి కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా పార్లమెంట్ పరిధిలోని 33 మంది బూత్ స్థాయి కార్యకర్తలకు  13.65 లక్షల చెక్కులను అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల అధ్యక్షుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన పత్రికా ప్రకటన విడుదల చేస్తూ చనిపోయిన, వివాహమైన, నూతన గృహప్రవేశం, హాస్పిటల్ బిల్లులు తదితర కేసులకు తన ఫౌండేషన్ ద్వారా కార్యకర్తలకు తగిన సహాయం చేస్తానన్నారు. కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎంపీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్లు, మండలాల అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎంపీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Distribution of 13.65 lakh checks to booth level workers through Arvind Dharmapuri Corpus Fund

More articles

Latest article