— బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
బతుకమ్మ, పిట్లం : అంగన్వాడి సెంటర్ లో చిన్న పిల్లలు ఉంటారని తెలియదా సెంటర్ మొత్తం దుర్వాసన రావడంతో టీచర్ పై సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పిట్లం మండల అధికారులకు సబ్ కలెక్టర్ కిరణ్మయి హెచ్చరించారు. బుధవారం పిట్లం మండలం కేంద్రంలోని పలు కార్యాలయాలను ఆమె సందర్శించారు. పిట్లం కస్తూరిభా పాఠశాలలో నీటి సమస్యపై ఆమె పాఠశాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు డార్మెటరీ, డైనింగ్ హాల్ అను సందర్శించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే విధంగా చర్యలు చేపట్టాలని కస్తూరిబా ప్రిన్సిపల్ సరితకు ఆదేశించారు. విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన వాటర్ సంపును పరిశీలించి ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
వైద్య సేవలో నిర్లక్ష్యం వహించవద్దు
పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రిలో ఏర్పడుతున్న సమస్యలపై పలువురు ఆమెకు వివరించగా వాటిపై స్పందించిన ఆమె హాస్పిటల్స్ కావాల్సిన సదుపాయాలపై లిఖితపూర్వకంగా తనకు సమర్పించాలని ఆమేసించారు. మూత్రశాలలు లేక అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్న సమస్యకు ఎస్టిమేషన్ రెడీ చేసి తన కార్యాలయానికి పంపించాలని తాసిల్దార్ వేణుగోపాను ఆదేశించారు.అనంతరం పిట్లం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఆమె ఎంఈఓ కు సూచించారు. క్లాస్ రూమ్ లోని విద్యార్థులకు విద్యపై పలు సూచనలు చేశారు.

అంగన్వాడి సెంటర్లో పౌష్టికాహారం అందించాలి
పిట్లం మండల కేంద్రంలో గల 7 నెంబర్ అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి దుర్వాసన రావడంతో వాటిని సక్రమంగా నిర్వర్తించాలని అంగన్వాడి సెంటర్ నిర్వాహరాలు ప్రవీణకు ఆదేశించారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు కాబట్టి ఎలాంటి వ్యాధులు చూపకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అంగన్వాడి సూపర్వైజర్ రేణుకకు సూచించారు. సెంటర్లలో నిర్ణీత కాలపరిమితి చెందిన గుడ్లను, పాల డబ్బాలను సంబంధిత టెండరు నిర్వాహకులకు అప్పగించాలని ఆదేశించారు. పిట్లం మండల కేంద్రంలో గల జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో తల్లితినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యాయా లేదని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రబ్బానిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఎమ్మార్వో వేణుగోపాల్, ఎంపీడీవో కమలాకర్, ఎంపీ ఓ యాదగిరి, ఆర్ఐసితాలే, ఎంఈఓ దేవి సింగ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి యాదగిరి వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.
