27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రైతులు పసుపు లో సస్య రక్షణ చర్యలు చే పట్టడం అత్యవసరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల : వర్షాలు పసుపు రైతులకు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నీరు చేనులో ఉబికి రావడంతో పంటపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముసురు వానలతో వ్యవసాయ క్షేత్రాలు నీటితో నిండిపోవడంతో పసుపు పంట తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని ఉద్యాన శాఖ అధికారి రుద్ర వినాయక్ పేర్కొన్నారు. ఏర్గట్ల మండల పరిధిలోని పలు గ్రామాల్లో తెగుళ్ల బారిన పడ్డ పసుపు పంటను పసుపు పరిశోధన స్థానం కమ్మర్ పల్లి శాస్త్రవేత్త డా.మహేందర్ బుధవారం ఆయన పరిశీలించి పెద్ద మొత్తంలో పంటలకు తాటాకు మచ్చ తెగులు,లద్దె పురుగు (ఆకుపచ్చ పురుగు) తెగులు, దుంపకుళ్లు, దుంప ఈగ, ఆకు మాడు తెగులు సోకాయన్నారు. దీంతో పంటల దిగుబడి గణనీయంగా పడిపోయే ప్రమాదం ఉందన్నారు. రైతులు తమ పంటను కాపాడుకోవడానికి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.అనంతరం సస్యరక్షణ చర్యలను వివరించారు.చేనులో నిలి చిన నీటిని వెంటనే తొలగించాలన్నారు.ఎకరానికి 3 కిలోల వేపపిండి, 3జీ గుళికలు5 నుంచి 6 కిలోలు, అర బస్తా యూరియా,అర బస్తా పొటాష్ చల్లాలన్నారు. మర్రాకు తెగులు నివారణ కోసం ప్రోపికోనజోల్ 2-3 మీ.లి/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. దుంప కుళ్లు లక్షణాలు కనిపిస్తే ఎకరానికి 6 కిలోల కార్బోఫి రాన్ గుళికలు లేదా 2 గ్రా సి ఓ సి లేద మెటలక్సీల్ లీటరు నీటిలో కలిపి మొక్క మొదల్లో బాగా తడపలాని చెప్పారు. మర్రాకు లక్ష ణాలు కనిపిస్తే ప్రోపికోనజోల్ పిచికారీ చేయా లని సూచించారు. ఈ కార్యక్రమం లో గుమ్మీర్యల్ క్లస్టర్ ఏ ఈ ఓ సాయి సచిన్, మండల రైతులు సోమ రాజా రెడ్డి,బద్దం మోహన్,గడ్డం రవి, ఏలేటి రాజా రెడ్డి, నోముల రాజారెడ్డి,ముక్కెర దేవన్న, చిన్న సంజీవ్,గోపిడి నవీన్ పాల్గొన్నారు.

More articles

Latest article