యువకుడి అదృశ్యం

  ఎల్లారెడ్డి, బతుకమ్మ :   హైదరాబాద్ నుంచి ఎల్లారెడ్డిలో వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన దుర్గేందర్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డి పేట్ గ్రామానికి చెందిన చిట్యాల దుర్గేందర్(30)అనే వ్యక్తి హైదరాబాద్ లో రాపిడో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతని బంధువుల పెళ్లి ఉండడంతో దుర్గేందర్ తన బావమరిది ప్రసాద్ తో కలిసి హైదరాబాద్ నుండి కామారెడ్డికి వచ్చారు. కామారెడ్డి నుండి నిజాంసాగర్ బస్సు ఎక్కి ఎల్లారెడ్డికి వస్తుండగా లింగంపేట్...