కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం
. . . ఇద్ధరు పిల్లలను బావిలో తోసేసి తండ్రి ఆత్మహత్య ?
. . . ఇద్ధరు చిన్నారుల మృత దేహాల వెలికితీత
. తండ్రి డెడ్ బాడీ కోసం గాలింపు
తాడ్వాయి, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా లో దసరా పండగ వేళ తీవ్ర విషాధం చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో వ్యవసాయ బావిలోఇద్దరు పిల్లలు మృతదేహలు వెలుగు చూసాయి. ఈ సంఘటన శనివారం రాత్రి అలస్యంగా వెలుగు చూసింది. చనిపోయిన వారిని విగ్నేష్ (7), అనురిద్ (5)మృత దేహాలు గుర్తించారు. దసరా పండగ సంధర్బంగా తండ్రి చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కోత్త బట్టలు వేసుకుని ఇద్ధరు పిల్లలు విగ్నేష్, అనిరుద్ లు జంబి కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. రాత్రి వరకు రాకపోవడంతో అనుమానంతో గాలించగా ఇద్ధరు పిల్లల వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. చిట్టపు శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బావి వద్ద శ్రీనివాస్ రెడ్డి సెల్ పోన్ తో పాటు చేతి గడియారం, చెప్పులు గుర్తించారు. శ్రీనివాస్ రెడ్డి డెడ్ బాడి కోసం బావిలో గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేస్తున్నారు. శ్రీనివాస్ నందివాడకు ఇళ్లరికం వచ్చినట్టు తెలిసింది. శ్రీనివాస్ రెడ్డి తన పిల్లలను బావిలో తోసేసి ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కుటుంబ కలహల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.
