27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మాండలిక వికాసమే భాషాభివృద్ధికి సోపానం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమగ్ర తెలంగాణ నిఘంటువు అవసరం

 

. . . ప్రామాణిక భాష మాండలిక భాషలను మింగుతుంది

 

. . . ప్రముఖ సాహితీ వేత్తలు, పరిశోధకులు

 

. . . ఘనంగా గిరిరాజ్ కళాశాలలో మాండలిక సాహిత్య వికాసం, విస్తృతి -వైవిధ్యం జాతీయ సదస్సు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

మాండలికి వికాసమే భాషాభివృద్ధికి మూలం అని, మన భాషలోని తెలుగు భాష మూలాలు ఉన్నాయని పలువురు ప్రముఖ సాహితివేత్తలు పేర్కొన్నారు. గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొరవి గోపరాజు తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం వికాసం వికృతి వైవిధ్యం అంశంపై ఒకరోజు జాతీయ సదస్సు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఆచార్యులు బాణాల భుజంగ రెడ్డి కీలకోపన్యాసం చేశారు. తెలుగు భాష మూలాలు తెలంగాణ మాండలికంలోనే దాగి ఉన్నాయని పేర్కొన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ పరిశోధకులు సంగనభట్ల నర్సయ్య ప్రసంగిస్తూ తెలంగాణ భాషా పరిరక్షణకు ప్రత్యేకంగా నిఘంటువును రూపొందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన కొన్ని మాండలిక పదాలు ఆహుతులను అలరించాయి. ప్రామాణిక వ్యసాలతో రూపొందించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపల్ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు విభాగం ఏర్పాటు చేసిన మాలిక సాహిత్యం జాతీయ సదస్సు ఇది ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల విద్యార్థుల వికాసానికి ఎంతో దోహదం చేస్తాయన్నారు. సదస్సు కన్వీనర్ లెఫ్ట్నెంట్ డాక్టర్ రామస్వామి మాట్లాడుతూ.. తెలుగు మాండలిక సాహిత్యం గొప్పతనాన్ని దాని పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ జాతీయ సదస్సును అంతర్జాలము, వేదిక పైన రెండు వేదికలపై నిర్వహించడం. మన రాష్ట్రం నుంచి కాకుండా తమిళనాడు, చెన్నై, ఢిల్లీ, ఒరిస్సా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితరుల విశ్వవిద్యాలయం నుంచి పరిశోధకులు రావడం అభినందనీయమన్నారు. మొదటి, రెండవ వివిధ విశ్వవిద్యాలయం చెందిన పరిశోధకులు ఆచార్యులు అధ్యాపకులు పత్ర సమర్పణ చేశారు. ముగింపు సమావేశంలో ప్రముఖ సాహితీవేత్త హైదరాబాద్ సిటీ కళాశాల ఆచార్యులు డాక్టర్ కోయ కోటేశ్వరరావు కీలక ఉపన్యాసం చేశారు. యూట్యూబ్లో జానపద పాటల్లో అరుదయినా సంపద గ్రామీణ పదాలే అన్నారు. అస్తిత్వ ఉద్యమం వచ్చిన తర్వాతే అద్భుతమైన బాషా ఉందన్నారు. గ్రామీణ ప్రజల నుంచి సేకరించిన పదాలే భాషను బతికిస్తాయన్నారు. వచ్చే 50 ఏళ్లలో 7 భాషలు సంకరంగా మన తెలుగు మారిపోతుంది. తాతలు భాషను కాపాడేందుకు యువత పైనే ఉంది. నిఘంటువుల్లో కన్న బయట ఉన్న భాష గొప్పదన్నారు. ప్రముఖ గాయకులు, పద కర్తలు అన్నమయ్య, రామదాసు కీర్తన ల్లో స్థానిక మాండలిక పాదాలున్నాయన్నారు. ప్రామాణిక తెలంగాణ తెలుగు భాషకు ప్రాణం, అసలైన తెలుగు పదాలు తెలంగాణలోనే బతికున్నాయ్భాష, మాండలిక పదాలను అంతం చేస్తున్నాయన్నారు. సజీవమైన భాష తెలంగాణ మాండలికంలోనే ఉందన్నారు. ప్రామాణిక భాష మాండలిక భాషలను మింగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అతిథులను పత్ర సమర్పకులను అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కళాశాల విద్యార్థుల స్వాగత నృత్యం ఆకట్టుకుంది. వైస్ ప్రిన్సిపల్ రంగరత్నం, ఐ కే సి కోఆర్డినేటర్ రాజేష్, పిఆర్ఓ దండు స్వామి, ఏవో రామకృష్ణ, సూపరిండెంట్ ఉదయ్ భాస్కర్, అధ్యాపకులు శమంత, శ్రీనివాస్ గంగాధర్ రాజేశ్వర్, రాధిక, అర్చన తదితరులు పాల్గొన్నారు.

Dialect development is the stepping stone to language development.

 

More articles

Latest article