. . . సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు.
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
ప్రజా సమస్యల అధ్యయనంలో భాగంగా శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్మికులు ఆయా రంగాల ప్రజల సమస్యలను సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు తెలుసుకొని వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాయడంతో పాటు, సంగం సాధారణ ప్రజలకు కూడా కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడుతున్నారని, ఫలితంగా ప్రజా సమస్యలు రోజురోజుకు పేరుకు పోతున్నాయని అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయని అందువల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ప్రజా సమస్యలు పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోజురోజుకీ పేదరికం పెరగటంతో ఉపాధి లేకుండా ప్రజలు నిరుద్యోగులుగా మారి అప్పుల పాలవుతున్నారని ఉపాధి అవకాశాలను పెంచటానికి కనీస సౌకర్యాలు అయిన గూడు, గుడ్డ, కూడు కల్పించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుందని ఆయనన్నారు. అందువల్ల వాటి సాధన కొరకు కనీస సౌకర్యాల అమలు కొరకు ఐక్య పోరాటాలు తప్ప మరో మార్గం లేదని పోరాటాలకు ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీలా, సరస్వతి, వెంకటమ్మ, ఇమామ్, మోహన్, సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

