30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపు నిజామాబాద్ లో డీజీపీ శివధర్ రెడ్డి పర్యటన

Must read

📰 Generate e-Paper Clip

. . . అలైవ్ అరైవ్ కార్యక్రమంలో పాల్గొనున్న డీజీపీ

 

నిజామాబాద్ , బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం పర్యటించనున్నారు. డీజీపీ పర్యటన కోసం జిల్లా పోలీసు శాఖ అన్నీ ఏర్పాట్లను చేసింది. నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్డు చౌరస్తాలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొనున్నారు. అనంతరం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్, మాక్లూర్ పోలీస్ స్టేషన్ ను ప్రారంభిస్తారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజి ఆడిటోరియంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రారంభ కార్యక్రమంను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి డీజీపీతో పాటు ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మహ్మద్ ఆలీ షబ్బీర్, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు హాజరుకానున్నారు.

More articles

Latest article