25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి డీఈవో సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నవీపేట్ : బెంగళూరులోని దక్షిణ భారత ప్రాంతీయ ఆంగ్ల భాషా శిక్షణ సంస్థ నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి, అగ్రశ్రేణి A+ గ్రేడు సాధించిన మండలం లోని శివతండా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శివ కుమార్ ను శుక్రవారం నిజామాబాద్ డిఇఓ అభినందించారు. ఈ శిక్షణలో ఐదు రాష్ట్రాల నుంచి మొత్తం 170 మంది ఉపాధ్యాయులు పాల్గొనగా, అందులో కేవలం 10 మందికి మాత్రమే A+ గ్రేడు లభించిందని,  తెలంగాణ నుంచి పాల్గొన్న 47 మందిలో A+ గ్రేడు సాధించిన ముగ్గురిలో శివకుమార్ ఒకడు కావడం గర్వకారణమని, 30 రోజుల శిక్షణను విజయవంతంగా పూర్తి చేయడం, ఆంగ్ల భాషపై నైపుణ్యం పెంపొందించుకోవడం అభినందనీయం అని డీఈవో ప్రశంసించారు. అలాగే ఈ శిక్షణలో నేర్చుకున్న ఇంగ్లీష్ భాష నైపుణ్యాలను పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఉపయోగపడేలా బోధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగోని కిషన్, జిల్లా నాయకులు అశోక్, నవీన్,  జీవన్ పాల్గొన్నారు.

More articles

Latest article