28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తండ్రి పై కూతురి ప్రేమ

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: మద్నూర్ మండల కేంద్రానికి చెందిన వాగ్మరే ప్రభాకర్ రావు ఐదు సంవత్సరాల క్రితం చనిపోయారు. తండ్రి మరణించి ఐదు సంవత్సరాలు గడిచిన ఆయన కూతురు జ్యోతి మరువక ఆయన వర్ధంతి సందర్భంగా బుధవారం మద్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, బాటిల్ పంపిణీ చేశారు. వాగ్మరే జ్యోతి మాట్లాడుతూ.. తల్లిదండ్రులు దైవంతో సమానం వారి

Daughter's love for father

వల్లనే మనకు ఈ జీవితం ఉందని అన్నారు. మీరు కూడా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాలి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు దిశ నిర్దేశం చేశారు. విద్యార్థులకు వేసవికాలం ఉండడంతో శరీరానికి నీటి శాతం ఎక్కువ అవసరం అవుతుందని బాటిల్ పంపిణీ చేశామన్నారు. ఏదో ఒక కారణంతో అప్పుడప్పుడు ఇలా సమాజానికి తన వంతు సాయం చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, ఉపాధ్యాయురాలు, వారి కుటుంబ సభ్యులు వాగ్మరే శివశంకర్, సాగర్ ఉన్నారు.

Daughter's love for father

More articles

Latest article