వెబ్ డెస్క్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నార్త్ మండలంలోని ఒక మహిళకు కరోనా పాజిటివ్ నమోదైంది. దేశంలో కరోనా మొదటి, రెండవ పాజిటివ్ కేసుల తర్వాత కరోనా కనుమరుగైన విషయం తెల్సిందే. ఆ సమయంలో కరోనా పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు కాగా వందల మంది చనిపోయారు. తాజాగా కరోనా కేసులు దేశంలో 4 వేల పైచిలుకు దాటాయి. ఇటీవల నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహిళ కరోనా టెస్టు చేయించుకోగా జిల్లా అధికార యంత్రాంగం పాజిటివ్ గా నిర్ధారించింది. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.
