29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఎవరెస్ట్ అడ్వంచర్ శిబిరానికి తాళ్లకుంట తాండ విద్యార్ధి 

Must read

📰 Generate e-Paper Clip

  • ఇప్పటికే నార్త్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరిన మాలవత్ లింబాద్రి

 

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని బాబానగర్ (తాళ్ళ కుంట)తండాకు చెందిన మాలవత్ లింబాద్రి ఎవరెస్ట్ అడ్వంచర్ శిబిరానికి ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహించిన సెలక్షన్ లో ప్రతిభకనబర్చి ఈ ఎవరెస్ట్ అడ్వంచర్ శిబిరానికి ఎంపికయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది క్లెయింబర్స్ లో మాలవత్ లింబాద్రి ఒక్కరు. జిల్లాలోని నూతపల్లి గ్రామంలోని ఎం. జే. పి బాయ్స్ స్కూల్ లో తొమ్మిదొ తరగతి చదువుతున్న లింబాద్రి తన తోటి క్లెయింబర్స్ తో కలిసి ఎవరెస్ట్ ను అధిరోయిస్తూ ఇప్పటికే 5150 మీటర్ల ఎత్తున ఉన్న నార్త్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ను చేరుకొన్నట్లు ఫిజికల్ డైరెక్టర్ ప్రదీప్ తెలిపారు. ఈ బృహత్తర అవకాశం బుడుత వయస్సులో రావడం అదృష్టమని ఈ అవకాశన్ని వినియోగించుకొని మన జిల్లాకు, మండలానికి, సొంత గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. పిన్న వయస్సులో ఎవరెస్ట్ ను అధిరోయించిన మాలవత్ లింబాద్రిని స్కూల్ ప్రిన్సిపాల్, పీడీ, స్కూల్ స్టాఫ్, గ్రామ ప్రజలు అభినందిస్తున్నారు.

More articles

Latest article