28.8 C
Hyderabad
Monday, August 3, 2026

జైలు అధికారులను ముసిరిన వివాదాలు

Must read

📰 Generate e-Paper Clip

  • బదిలీ అయిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణలు
  • కొందరికి జిల్లా జైలులో విఐపి ట్రీట్ మెంట్ అని లేఖతో ఫిర్యాదు
  • జైలు అధికారుల అమానుష దాడిలో జీవిత ఖైదీకి తీవ్రగాయాలు
  • విచారణకు ఆదేశాలు

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సెంట్రల్ జైల్ అధికారుల చుట్టు వివాదాలు ముసురుతున్నాయి. జిల్లా జైలులో పనిచేసి ఇటీవల బదిలీ అయిన అధికారిపై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. జైళ్ల శాఖలో పనిచేస్తున్న అధికారి ఒకరు ఓ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగిని వేధించినట్లు  ఆరోపణలు వచ్చాయి. అయితే అధికారులు ఆ వివాదం సద్దుమణిగిందని, సదరు మహిళా ఉద్యోగి లిఖితపూర్వకంగా తనపై ఎలాంటి వేధింపులు జరుగలేదని లేఖ రాసిచ్చిందని అధికారులు ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అధికారుల వేధింపులు జరుగకపోతే జూనియర్ అసిస్టెంట్ గా పనిచేసే మహిళా ఉద్యోగి చేత లిఖిత పూర్వకంగా లేఖ రాసిచ్చారని చెప్పడం గమనార్హం. అది నిజామాబాద్ జైలులో జరుగలేదని ఆ అదికారి బదిలీ అయ్యారని అధికారులు చేతులు దులిపేసుకున్నారు.

ఇటీవల ఒక వ్యక్తి జిల్లా సెంట్రల్ జైలులో కొందరికి విఐపి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని కోర్టు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. స్థానికంగా జైలు దగ్గరలోని ఓ గ్రామానికి చెందిన కొందరు మధ్యవర్తులుగా వ్యవహరిస్తు ఖైదీల సంబంధికులు, రిమాండ్ ఖైదీల బందువుల వద్ద వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారి ద్వార కాసులు వస్తుండటంతో అధికారులు సంబంధిత వ్యక్తులకు కారాగారంలో విఐపి ట్రీట్ మెంట్ ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఓ అధికారి మహిళా ఖైదీల పట్ల అనుచితంగా ప్రవరర్తిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి తన పేరు కాకుండా మారు పేరుతో ఫలనా గ్రామావాసిగా ఫిర్యాదు చేయడం  విశేషం. ఈ విషయంలో విచారణ జరుపాలని ఇటీవల ఆదేశించినట్లు సమాచారం. దసరా సెలవులు కావడంతో విచారణ ఆలస్యం అవుతున్నట్టు తెలిసింది.

ఇదిలా ఉండగా సెప్టెంబర్ మొదటి వారంలో జైలులో శిక్ష అనుభవిస్తున్న నిజామాబాద్ నగరానికి చెందిన జీవిత ఖైదీపై ఓ అధికారి అమానుషంగా దాడిచేసినట్లు తెలిసింది. ఈ దాడిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి చేయి విరిగింది. దానితో ఖైదీకి జిల్లా జనరల్ ఆసుపత్రిలో వైద్యం అందిస్తు బాధిత కుటుంబ సభ్యులకు, అధికారులకు సమాచారం అందించారు జైలు అధికారులు. జైలుకు వచ్చిన జీవిత ఖైదీ తాలుకు సోదరుడు అధికారులను నిలదీయడంతో కాళ్లు పట్టుకుంటామని, ఈ విషయం పెద్దది చేయవద్దని బ్రతిమాలినట్లు తెలిసింది. అధికారులు సస్పెండ్ చేస్తారని బతిమాలుకుని ట్రీట్ మెంట్ చేయిస్తామని పరస్పర ఒప్పందంతో వివాదాన్ని సద్ధుమణిపించడం గమనార్హం. జిల్లా సెంట్రల్ జైలు చుట్టూ వివాదాలు జరుగడం వెనుక కొందరు అధికారుల ప్రమేయం ఉందనే వాదనలు లేకపోలేదు. ఇటీవల కాలంలో పదోన్నతుల వ్యవహారం జరుగుతుండటంతో కొందరిపై ఆరోపణలు దెబ్బతిసేందుకు వివాదాలను రెపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా జైలు కాస్తా సెంట్రల్ జైలుగా అప్ గ్రేడ్ తరువాత సంస్కరణలతో ప్రఖ్యాతి గాంచుతున్న తరుణంలో వివాదాలు ముసరడంతో దానిపై జైళ్ల శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

More articles

Latest article