24 C
Hyderabad
Sunday, August 2, 2026

కంట్రోల్ బియ్యం..  ఊళ్ళో కయ్యం.. 

Must read

📰 Generate e-Paper Clip

  • ఒక దుకాణానికి వస్తే మరో దానిలోకి  రావట్లే
  • ఆందోళన చేస్తున్న అబ్దిదారులు 
  • ఎంఎల్ఎస్ గోదాం అధికారి  ఇష్టారాజ్యం 

నిజామాబాద్, బతుకమ్మ: పేదలకు పంపిణి చేసే బియ్యం ఊళ్ళో కయ్యానికి కాలు దువ్వేలా  చేస్తుంది. గ్రామంలో ఒక  దుకాణుదారునికి బియ్యం ఇస్తే మరో దానికి ఇవ్వట్లేదు. దీనివల్ల ఆ ఊరిలోని అబ్దిదారులు ఆందోళన చేస్తున్నారు. ఎంఎల్ఎస్ గోదాం నిర్వాహక అధికారి నిర్లక్ష్యం వల్లే  గ్రామాల్లో పరోక్షంగా దుకాణుదారునితో  బియ్యం గొడవలు అవుతున్నాయి.  ఒక ఊరికి లోడ్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నరేషన్ దుకాణాలల్లో దించాలి. ఒక దానిలో వేసి మరో దానిలో వేయకపోవడంతో అనుమానాలకు తావిస్తోంది.

  • ఎంఎల్ఎస్ గోదాం ఇష్టారాజ్యం 

పేదలకు బియ్యం పంపిణి చేసేందుకు ముందుగా ప్రభుత్వానికి డిడి లు చెల్లిస్తుంటారు. సర్కారు ఖాతాలో డిడి డబ్బులు జమ కాగానే దాని ప్రకారంగా వారికి కావాల్సిన బియ్యాన్ని కేటాయిస్తుంటారు. యజమానిని పిలిపించి  వేలి ముద్ర తీసుకొని వారి ముందే  తూకం వేసి గ్రామాలకు తరలించాల్సిన బాద్యత గోదాం  అధికారిదే ఉంటుంది. సమాచారం లేకుండానే లోడ్ ను తీసుకొచ్చిన డ్రైవర్ దుకాణం ముందు నిలిపి యజమానికి ఫోన్ చేస్తున్నాడు. గోదాంలో తాము వేలి ముద్ర వేయనేలేదు, సరుకు ఎలా పంపుతారని ప్రశ్నిస్తే మీకు ఫోన్ చేసాం కలవలేదు అని కుంటి సాకులు చెప్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. మందలించినట్లు మాట్లాడితే మనసులో పెట్టుకొని  చివరి రోజుల్లో పంపించి, పంపిణికి ఆలస్యం అయ్యేలా చేస్తున్నారని దుకాణుదారులు మిన్నకుండి పోతున్నారు.

  • ఒక ఊరిలోకి రెండుసార్లు.. 

గ్రామంలో రెండు దుకాణాలు ఉంటే ఒకేసారి బియ్యం చేరవేయాల్సి ఉంటుంది. గోదాం అధికారి నిర్వాహకం వల్ల ఊరికి రెండు సార్లు లోడ్  వస్తోంది. నందిపేట్ మండలంలోని కుధావంద్ పూర్ గ్రామంలో ఇలాగే  జరిగితే దుకాణ నిర్వాహకునితో గురువారం గొడవ జరిగినట్లు తెలిసింది. నవీపేట్  ఎంఎల్ఎస్ పాయింట్ కింద నవీపేట్, నందిపేట్, దొంకేశ్వర్ మండలాలతో పాటు మాక్లూర్ మండలంలోని నాలుగు గ్రామాలు ఉన్నాయి. ప్రతి నెల బియ్యం సరఫరాలో ఇదే తరహాను పాటిస్తుండడంతో దుకాణుదారునికి, లబ్దిదారులకు మద్య తరచుగా వివాదం నెలకొంటుంది.  ఆ పంపెదేదో ఊరికి ఒకేసారి పంపిస్తే గొడవలు జరగకుండా ఉంటాయని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో వివాదాలు రాకుండా ఉండాలంటే ఒక ఊరికి ఒకసారి బియ్యాన్ని పంపించాలని వేడుకున్నా ప్రయోజనం లేకుండా ఉందని రేషన్ దుకాణాల నందిపేట్ మండలాద్యక్షుడు నవీన్ అసహనం వ్యక్తం చేసారు. గోదాంలో యజమాని వేలి ముద్ర , తూకం లేకుండానే లోడ్ పంపిస్తున్నారని దీనిపై అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు.

More articles

Latest article