- జిల్లా ఇంచార్జీ మంత్రి పర్యటనలో కాంగ్రెస్ లో గ్రూప్ తగదాలు బట్టబయలు
- ఏనుగు రవీంధర్ రెడ్డిని అడ్డుకున్న పోచారం వర్గీయులు
- అధికారిక కార్యక్రమం వద్ద కాంగీయులు ఘర్షణ
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయలు భగ్గమన్నాయి.. జిల్లా ఇంచార్జీ మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నాయకులు తగ్గేదేలే అనే స్థాయిలో గొడవపడ్డారు. జిల్లాలో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో అధికార పర్యటన చేస్తున్న సీతక్క గ్రూప్ రాజకీయాలతో షాక్ కు గురయ్యారు..
నిజామాబాద్ జిల్లాలో ఏఐసిసి జాతీయ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్ రెండు రోజులుగా జనహిత పాధయాత్ర కోసం బస చేశారు. రాష్ట్ర ఇంచార్జీకి తోడు ఇందూర్ జిల్లాకు చెందిన రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాలోనే ఉన్నారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రిగా నియమితులైన ధనసరి అనుసూయ అలియాస్ సితక్క పాల్గొన్న అధికారిక కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడటం కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో నూతన పంచాయతీ భవన ప్రారంభం కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపి సురేష్ షట్కార్ లతో పాటు జిల్లా కలెక్టర్ వినయ్ క్రిష్ణ రెడ్డి హాజరయ్యారు. అధికారిక కార్యక్రమం కావడంతో అందరిని అధికారికంగానే పిలిచారు. కానీ ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ,నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జీ ఏనుగు రవింధర్ రెడ్డి హాజరు కావడంతో వివాదం చెలరేగింది.
మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని పంచాయతీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనకుండా పోచారం వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఏనుగు రవింధర్ రెడ్డి, పోచారం వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వారి మధ్య కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. పోటా పోటీగా నినాదాలు.. తోపులాట జరిగింది. జిల్లా ఇంచార్జీ మంత్రి సమక్షంలో జరిగిన వివాదంలో ఏనుగు వర్గీయులపై పోచారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవ్వరు వారు ఆంటు ఆగ్రహంలో ఉగిపోయారు. స్థానికంగా బందోబస్తుకు వచ్చిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఇరు వర్గాలను సముదాయించారు. మంత్రి సీతక్క సమక్షంలోనే రెండు గ్రూప్ ల మధ్య ఉన్న విభేదాలు, గ్రూప్ రాజకీయాలు బహిర్గతమయ్యాయి.

బాన్సువాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు ఈనాటిది కాదు. కాంగ్రెస్ పార్టీ తరపున బాన్సువాడలో పోటీ చేసి ఓటమి చెందిన ఏనుగు రవింధర్ రెడ్డి నియోజకవర్గం ఇంచార్జీగా ఉన్నారు. ఎన్నికలలో బీఆర్ఎస్ తరుపున ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గం అభివ్రుద్ధి కోసమని కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. రెండు గ్రూప్ ల మద్య గొడవలు, పోలీస్ స్టేషన్ లలో కేసులు సర్వసాధరణ మయ్యాయి. అక్కడ గ్రూప్ రాజకీయాలపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గం బాధ్యతలపై క్లారీటి ఇచ్చిన ఘర్షనలు ఆగలేదు. అంతే గాకుండా దాడులు, ప్రతి దాడుల నేపథ్యంలో ఏనుగు వర్గీయులను( అసలు సీసలైన కాంగ్రెస్ ) నాయకులపై పార్టీ క్రమ శిక్షణ చర్యలు తీసుకొని సస్పెండ్ చేసిన రెండు గ్రూప్ లు తగ్గడం లేదు. ఇటీవల నియోజకవర్గంలో స్థానిక నామినేటేడ్ పదవులు అన్నీ పోచారం వర్గీయులకు ఇప్పించుకున్నప్పటి నుంచి గ్రూప్ రాజకీయాలు పీక్ స్టేజీకి చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావడానికి నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర ఇంచార్జీ, పీసీసీ చీఫ్, జిల్లా ఇంచార్జీ మంత్రి ఉండగానే రెండు గ్రూప్ లు గొడవలకు దారితీయడం కలకలం రేపుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలకు చెక్ పెట్టకపోతే అటు కామారెడ్డి, ఇటు నిజామాబాద్ అర్బన్, అటు బాల్కోండ నియోజకవర్గంలో నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలతో పార్టీకి చేటే అని సీనీయర్ లు చెబుతున్నారు. పార్టీ అధిష్టానం చందూర్ లో జరిగిన రెండు వర్గాల గొడవను సద్ధుమణిగిస్తారా, క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటారా అనే చర్చ మొదలైంది.

