29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బీజేపి పార్టీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి

 

రుద్రూర్, బతుకమ్మ :

 

బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ ఆధ్వర్యంలో సహించదు తెలంగాణ కార్యక్రమంలో భాగంలో రాష్ట్ర ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నందున మంగళవారం రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయంలో బీజేపి నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీలను ఇచ్చి హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం వహిస్తుందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తూ రైతులను మోసం చేస్తూ, రైతు నడ్డి విడిచి, సాధ్యం కానీ హామీలు ఇచ్చి గద్దెనెక్కిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు మోసం చేసి మోసపూరిత మాటలు చెప్పుకుంటా, మాయమాటలు చెప్పి రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్, జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కటిక రామరాజు, ఏముల గజేందర్, పార్వతి మురళి, బీవీ గుప్తా, బేగరి వినోద్ కుమార్, కేవీడీ సాయిలు, గుడిసె ప్రభాకర్, ధర్మవరం వెంకటేష్, బోజిగొండ అనిల్, శానంబాలాజీ, కృష్ణంరాజు, ఎర్రోళ్ల గంగాధర్, ఈశ్వర్, తెల్లరవి, పోశెట్టి, గోపి, చిన్న సాయిలు, శేఖర్, నడిపి రాజేష్, గంగులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article