30.9 C
Hyderabad
Monday, August 3, 2026

విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని విద్యారంగా అభివృద్ధికి తోడ్పాటును అందించాలని ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నిజామాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నగరంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేసవి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీ ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేసి విద్యారంగం అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీ ఎంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించి విడుదల చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్ జిల్లా లో తెలంగాణ రాష్ట్రం పేరు తో ఉన్నటు వంటి తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఈ సమస్యల పైన ఈ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించి విద్యారంగా అభివృద్ధికి కావలసినటువంటి నిధులను కేటాయించాలని, నిధులు కేటాయించకపోతే మాత్రం రాబోయే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ అధ్యక్షులు సుభోద్, జిల్లా కోశాధికారి అనూష, నాయకులు నిఖిల్, గణేష్, విట్టల్ పాల్గొన్నారు.

More articles

Latest article