30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే రైతులకు మేలు

Must read

📰 Generate e-Paper Clip

. . . మార్కెట్ కు తరలించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం

. . .  మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

కాంగ్రెస్ ప్రభుత్వం తోనే తెలంగాణ రాష్ట్రంలో రైతులకు మేలు జరుగుతుందని,  రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను మార్కెట్ యార్డుల ద్వారా కొనుగోలు చేసి వారికి ఆర్థికంగా భరోసాను కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

 

Congress government is good for farmers  సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధానంద్ గంజిలో ఏర్పాటుచేసిన నిజామాబాద్ నూతన మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కర ఫ్యాక్టరీలను తెరిపించే విధంగా తమ ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తుందని అందుకు అనుగుణంగా చెరుకు రైతులు కూడా చక్కెర ఫ్యాక్టరీ అవసరమగు టన్నుల చెరుకును సాగు చేయాలని అప్పుడే చక్కర ఫ్యాక్టరీలు లాభంగా నడుస్తాయని,  అలాంటప్పుడు చెరుకు రైతులకు కూడా ఎంతో లాభం జరుగుతుందన్నారు.

Congress government is good for farmers

రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ఎంతో ప్రత్యేక స్థానం ఉందని ఇక్కడ రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించడానికి నిజామాబాద్ జిల్లా నుండి కాకుండా ఇతర జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా అక్కడి రైతాంగం మన మార్కెట్ యార్డులో విక్రయించడానికి ధాన్యాన్ని తరలిస్తుంటారని, ఇదేవిధంగా భవిష్యత్తును కూడా నిజామాబాద్ మార్కెట్ యార్డ్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ మార్కెట్ యార్డ్ గా తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తామనిహామీ ఇచ్చారు.ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక రైతు బిడ్డ అయిన తనను గుర్తించి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా తనకు అవకాశం కల్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా మార్కెట్ యార్డులో రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్న వాటిని పరిష్కరించే విధంగా ధనవంతు కృషి చేస్తానన్నారు.  అలాగే వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాగాని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. రైతు సమస్యలు ఏంటో తనకు పూర్తిగా తెలుసునని మార్కెట్ యార్డుకు వచ్చిన ఏ రైతు కూడా ఇబ్బందులు పడకుండా చూడాల్సిన తనపై ఉందన్నారు. అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్,  డైరెక్టర్లను పార్టీ నేతలు కార్యకర్తలు సన్మానించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్, నగర మేయర్ దండు నీతూ కిరణ్, డిసిసి అధ్యక్షులుమానాల మోహన్ రెడ్డి,ఐడిసిఎంఎస్ చైర్మన్ తారా చంద్ , నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశ వేణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article