25.9 C
Hyderabad

కొడుకుకు కొరివి పట్టిన తల్లి

Must read

📰 Generate e-Paper Clip

. . . 23 రోజులకు స్వదేశానికి చేరుకున్న మృతదేహం

ఇందల్వాయి, బతుకమ్మ :

చెట్టంతా కోడుకు చెతికోచ్చిన తరువాత గుండేపోటుతో మరణించగా పుట్టేడు దుఖం లో తల్లి అతడి చితికి నిప్పంటించి అంత్యక్రియలు నిర్వహించిన సంఘటన ఇందల్వాయిలో జరిగింది.గత నెలలో దుబాయ్ లో గుండేపోటుతో మరణించిన సున్నం రమేష్ అంత్యక్రియలు సోమవారం అతని స్వగ్రామం ఇందల్వాయిలో జరిగాయి.ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన సున్నం రమేష్ (23)   గత 10 సంవత్సరాలుగా బతుకుదేవుకోసం దుబాయి కి వలస వెళ్ళాడు. దుబాయ్ లో సరైన జీతాలు రాక, పనులు లేక  అడ్డా కులిగా పని చేసేవారు. అక్కడే పని చేసుకుంటున్నా రమేష్ గత నెల 14 న గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు . రమేష్ మృతి వార్త తెలుసుకున్న గల్ఫ్ కార్మికుల రక్షణ సేవ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షుడు గుండెల్లి నర్సయ్య , సభ్యులు మృతి దేహాన్ని స్వదేశానికి పంపడంతో రమేష్ పార్థివదేహానికి  తల్లి భారతీ కొరివి పెట్టి అంత్యక్రియలను నిర్వహించారు.

More articles

Latest article