ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారచంద్ చౌదరి మృతికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాపం తెలిపింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తారచంద్ మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాప సూచకంగా సోమవారం విధులకు దూరంగా ఉండడాని తీర్మానించారు. బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, ఉపాధ్యాయులు పిండం రాజు, న్యాయవాదులు ధోన్ పాల్ సురేశ్, జయప్రకాశ్ లోహియా, ఆరెట్టి నారాయణ, మాణిక్ రాజ్, బాలాజీ శ్రీమాన్, యూనిస్ ఖాన్, యెర్రం విఘ్నేశ్, నగేశ్వర్ రావు, శివాజీ భోస్లె, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
