న్యాయవాది మృతి కి సంతాపం
ఆర్మూర్, బతుకమ్మ : నిజామాబాద్ నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది తారచంద్ చౌదరి మృతికి నిజామాబాద్ బార్ అసోసియేషన్ సోమవారం సంతాపం తెలిపింది. బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన అత్యవసరంగా సమావేశమై మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ.. తారచంద్ మృతి న్యాయవాద సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన మృతికి సంతాప సూచకంగా సోమవారం విధులకు దూరంగా ఉండడాని తీర్మానించారు. బార్ ప్రధాన కార్యదర్శి వసంత్ రావు, ఉపాధ్యాయులు పిండం రాజు,...