33.4 C
Hyderabad

సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు కృపాల్ సింగ్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్ ఇస్తూ రెగ్యులర్ చేయాలని పీఆర్టయూ తెలంగాణ  జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. ధర్నాచౌక్ లో శనివారం రిలే నిరాహార దీక్ష కార్యక్రమనికి హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖ లో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని, తక్షణమే పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.  మరణించిన ఉద్యోగ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ప్రతి ఉద్యోగికి జీవిత బీమా కల్పించాలని అన్నారు. ముఖ్యమంత్రి త్వరలోనే సమస్య ను పరిష్కరించాలని కోరారు. రెగ్యులరైజ్ అయ్యేవరకు పీఆర్టయూ తెలంగాణ సంఘం అండగా ఉంటుందని  అన్నారు.

More articles

Latest article